Shaktipatamu    Chapters    Last Page

శక్తిపాతము

తృతీయ భాగము

కోశపంచకమున శక్తి వికాసము.

'కోశేషు తద్వికాసః | అన్న ప్రాణ మనో విజ్ఞానానందమయాః'

-- శ్రుతిః.

కోశములందు శక్తి వికాస మగునని శ్రుతి చెప్పుచున్నది. అన్నమయ - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ - ఆనందమయము లని కోశము లైదు. తైత్తరీయోపనిషత్తునం దైదు కోశముల వర్ణనము కలదు. వానిలో మొదటి నాల్గువ గోశములుగాను, దుదిదైన యానందమయకోశము, ఆత్మానంద స్వరూపముగాను జెప్పఁబడినవి.

'తస్య ప్రియమేవ శిరః, మోదో దక్షిణః పక్షః.

ప్రయోద ఉత్తరః పక్షః ఆనంద ఆత్మా, బ్రహ్మ పుచ్ఛం ప్రతిష్ఠా''

దీని శిరస్సు ప్రియము; కుడి ఱక్క మోదము; ఎడమ ఱక్క ప్రమోదము, ఆనందమే ఆత్మ, దాని తోక బ్రహ్మము. దీనివలన శక్తివికాసము మొదటి నాలుగు కోశములందే యని ప్రతీత మగుచున్నది ఆనందమయ కోశమందు నానంద వికాసము వికల్ప మాత్రమే. దాని భావ మేమనఁగా నానందము ననుభవించుటయే; యానందమయ పరమాత్మయొక్క సాక్షాత్కార మనియే అదియే యానందమయ వికాసము.

''స వా ఏష పురుషోన్నరసమయః, తస్మాద్వా ఏతస్మా దానందరసమయాత్‌, అన్యోంతర ఆత్మా ప్రాణమయః, ప్రాణమయా దన్యోంతర ఆత్మా మనోమయః, మనోమయా దన్యోంం తర ఆత్మా విజ్ఞానమయః, విజ్ఞానమయా దన్యోంతర ఆత్మా నందమయః''

--తైత్తరీయము.

పైనఁ జెప్పిన కోశములందు శక్తియొక్క వికాస మెటులు జరుగు ననెడి విషయము తెల్పుటకై ముందుగా స్వరూపము చెప్పఁబడును.

శక్తిస్థానమైన మూలకందము.

పాంచభౌతిక మైన శరీరకోశము అన్నపానాదులచేఁ బెంపబడును, దాని యందలి నాడు లనంతముగా నున్నవి. ప్రశ్నోపనిషత్తునందు నాడుల సంఖ్య డెబ్బదిరెండు వేలని చెప్పంబడెను. వానిలో సుషుమ్న యొకటి. మఱియుం బ్రధాన నాడులు నూఱును గలవు. ఒక్కొక్క వందనుండి మొత్తము డెబ్బదిరెండు వేల శాఖలుగాఁ బొడమినది. ఈ విధముగా ననంతమైన నాడులతో శరీరము వ్యాప్తమై యున్నది. ఆంగ్ల భాషయందు దీనికి 'Nerves' అని పేరు.

వాని మూలము 'కందము' దీనిని 'మూలకంద' మందురు. 'కంద' మనఁగా దుంప. పాశ్చాత్య విజ్ఞాని మత మందు నాడు లేవిధముగా వర్ణింపఁబడినను, మనము మన పూర్వులు మతము ననుసరించియే పోవుదము.

కంద మొక మాంసపేశి. అది తొమ్మిది యంగుళముల నిడుపును, నాల్గంగుళముల చుట్టుకొలతయుం గలది. దీని కేంద్రమందే కుండలినీ శక్తి స్థానము. ఇక్కడనుండియే సుషుమ్నా - ఇడా - పింగళానాడు లుద్గమించును. ఈ స్థానము గుదముకంటెం బైని సుపస్థముకంటె దిగువను - మేరుదండపుఁ గొనయైన త్రికాస్థి (మూఁడు చిన్న యెముకల సముదాయము) సమీపమున నుండును. ఆ మూఁడిటినుండి శాఖోపశాఖా క్రమమున వేలకొలఁది నాడు లుత్పన్నము లగును. పాశ్చాత్య మతానుసారముగ వీని యుత్పత్తి శిరః కపాలస్థానమం దందురు, కాని యోగి మతమునఁ గందమే దీని మూలమని చెప్పఁబడినది.

చిత్రా సుషుమ్నాది నాడీ వర్ణనము.

ఈ కందమునుండి మూఁడు కొమ్మలు (మూలశాఖలు) పుట్టును. అవి దిగువను సన్నముగాను, మీఁదికిఁ బోఁగాఁ బోఁగా లావుగాను నుండును. అందొకటి మేరుదండము నడుమను, దక్కినవి రెండును దాని వెలుపలను నిల్చియున్నవి. ఆ యిడాపింగళల యందు నిరువదినాలుగేసి ముడు లుండును (గ్రంథులుండును). యోగశిఖోపనిషత్తునందు నవి 'మణు' లని పేర్కొనఁబడినవి. ఆ మణులనుండి యొక శాఖ సుషుమ్న యొక్క చిత్రావిభాగమునకుఁ బోయి చేరును. ఇడనుండి బయలుదేరినది చిత్రయొక్క యెడమ భాగమందును, మఱిపింగళనుండి బయలు దేరినది చిత్రయొక్క కుడిభాగమందునుఁ జేరును. మఱియొకవైపున నా మణులనుండి మఱికొన్ని శాఖలును బయలుదేరును. అవి యన్నియు శరీరముయొక్క యంగ ప్రత్యంగములయందు వ్యాపించును. ఆ కలయిక రావియాకు నరముల యల్లికను బోలియుండును. ఈ క్రమము మూలా ధారమునుండి యాజ్ఞాచక్రము వఱకును గలదు. దానిపైనే యిడాపింగళలు కొసముట్టును గాని వాని శాఖలు రెండును నాసాపుటముల రెండివఱకును వచ్చును. మఱియు వానితో సంబంధముగల చిత్రాంతర్గతములైన శిరల సముదాయము కుడినుండి యెడమవైపునకును, నెడమనుండి కుడివైపునకును మళ్ళి యొండోంటితో సంగమించి మస్తిష్కమునకు వ్యాపించును. అవి సంగమించు స్థానమునే 'వారణాసి' యని వ్యవహరించిరి. ఇచటనే విశ్వేశ్వరుఁడు విరాజిల్లును. ఆజ్ఞాచక్రమును 'ప్రయాగ' మందురు. ఆజ్ఞాజక్రముకంటె రవ్వంత పైని మనోమయ చక్రము కలదు. అచ్చట నుండియే కన్ను, ముక్కు, చెవులు, నాలుక, ముఖము, హృదయ మను వానితో సంబంధించియుండు నాడులు బయల్వెడలును. పశ్చిమ విద్వాంసులు వీని నన్నిఁటిని మూఁడు విభాగములుగాఁ జేసి యివి యన్నియు సుషుమ్నకు సహయోగకారు లనిరి. ఈ విషయమును వివేకించి వివరించి వ్రాయుట నా లక్ష్యము కాదు. భారత విద్వాంసులు వీని నన్నిఁటిని సుషుమ్నా శాఖలుగానే యెన్నుకొనిరి.

మధ్యస్థాయా స్సుషుమ్నాయాః

పర్వపఞ్చసుసంభవాః | శాఖోపశాఖతాం

ప్రాప్తాః శిరా లక్షత్రయాత్‌ పరమ్‌ ||'

నట్టనడిమిదైన సుషుమ్నకు సంబంధించి, యైదు పర్వముల యందును బుట్టి శాఖోపశాఖలుగా నైన శిరలు మూఁడు లక్షలకు మీఱి యున్నవి. పంచపర్వ స్థానములు - 'గ్రీవ, పృష్ఠము, నాభి, కటి, మూలాధారము-' అనునవి ఈ వర్ణనమువలన మనము తెలికొనఁదగిన దేమనఁగా యోగులు చెప్పిన క్రమమున నది మూలకందయినుండి మీఁదికి మస్తిష్క పర్యన్తము వ్యాపించుట. ఇదే యనులోమ క్రమము పాశ్యాత్యుల మతమున దాని క్రమము దీనికి విపరీతము, అనఁగా విలోమక్రమము ఏమనఁగాఁ గందమందు శక్తి నిదురించునట్లుండి సహస్రారమునకుఁ బోవునపుడు సమాధ్యవస్థ కలుగును. అపుడు మోక్షప్రాప్తి యగును. దీనికి విపరీత క్రమమమనఁగా (శక్తి మేల్కొని సహస్రారము వఱకుఁ బోకుండుట) జనన మరణ రూప సంసారమందుఁ బడవేయుటకుఁ గారణమగును. సుషుమ్న పృష్ఠవంశము (వంశనాళము, మేరుదండము) నందున్నది, దీని మీఁది భాగము నుండి కేంద్రములవైపు లోపల మూఁడు భాగములు కలవు. అవే 'వజ్రా - చిత్రా - విరజలు.' మొదటి రెండును మేరు దండమునకు వెలుపల నుండును. అవి సుషుమ్నయందుఁ జేరిపోవును. అన్నిఁటికంటె బైనున్న వజ్రానాడి వజ్రమువలె దృఢముగా నుండును. నడుమఁ బలురంగులు గలది యగుట చేతఁజిత్రవర్ణయై 'చిత్ర' యను పేర వెలయుదాని కుడి యెడమలందు నిడా పింగళానాడు లుండును. చిత్రయొక్క రెండు వైపులనుండి నాడులు బయలుదేరి తొలుత సుషుమ్న యొక్క మీఁది భాగమందే చుట్టుకొని యుండును (అల్లుకొని యుండును). మఱియు వామభాగమందున్న వంశనాళ వామచ్ఛిద్రము నుండియు, దక్షిణ భాగమందున్న దక్షిణ చ్ఛిద్రమునుండియు వెలికి వచ్చి, యిడాపింగళలతోఁ గూడుకొనును. మఱియు నవి సర్వ స్వతంత్రముగాఁ గాలు సేతుల తుదల పర్యంతము వ్యాపించి యుండును. అనఁగా వీని దారినే శరీరమంతటికి మస్తిష్కముతో సంబంధము రచియింపఁబడినది.

బ్రహ్మనాడి కే 'విరజ' యని పేరు. ఆ నాడి తామర తీగవలె నుండి కమలములను బోలిన యాఱు చక్రములు కలది. యథార్థముగా నీ యాఱుచక్రముల స్థానములు చిత్రానాడి యందే కలవని యెఱుంగవలయును కాని యీ చక్రములు విడనంతదాఁక విరజామార్గము సరళముగానుండదు. ఇదే మోక్షమార్గ మనిన కారణమున ''ప్రముఖా'' యను పేర శ్రుతియందు వర్ణింపఁ బడినది.

హృదయనాడులు నూఱునొక్కటి. వానిలో నొకటి మూర్ధమునకుఁ బ్రాకి యుండును. దాని మార్గమున మీఁదికిఁ (సహస్రారమునకు) బోయినపు డమరత్వము నొందును (మోక్షము నొందును.) తక్కునాడుల దారిని నుత్ర్కమించి నపుడు పునరావృత్తి (విశ్వమందు మఱల జన్మించుట తప్పదు).

ఇచ్చట హృదయ మనఁగా హృదయపిండముగానే గ్రహింపక హృదయశక్తి యని యనఁగాఁ బ్రాణశక్తి యనియే గ్రహింపవలయును. దీనివలన హృదయనాడు లనియుం బ్రాణ వాహినీ నాడు లనియు నభిప్రాయము పైని జెప్పిన

'శతం చైకా చ హృదయస్య నాడ్య స్తాసాం మూర్ధాన మభినిఃసృతైకా, తయోర్ధ్వ మాయన్నమృతత్వ మేతి విష్వజన్యా ఉత్కృషణ భవన్తి.'

'ఇచ్చట దీని వ్యాఖ్యను వ్రాయుచు శ్రీమచ్ఛంకరా చార్యులును మంత్రమందుఁ జెప్పఁబడిన యొకనాడి దారి ననునపుడు 'సుషుమ్నానాడినే' గ్రహించిరి. మఱి యది హృదయము నుండి కాదు సరిగదా, పృష్ఠవంశ నాళమందే పైకి వ్యాపించును.' ఇమ్మాట దిగువ శ్లోకమువలన విస్పష్టము.

'గెదస్య పృష్ఠభాగేస్మిన్‌ వీణాదండ, స్ప దేహభృత్‌ |

దీర్ఘాస్థి దేహపర్యన్తం బ్రహ్మనాడీతి కథ్యతే ||''

గుదముయొక్క వెనుకటి భాగమందు వీణాదండము (సారె లమర్పఁబడిన వీణాదండమును బోలియుండుటచే వీణా దండమనియు, వెదురు బొంగునఁ గణుపులు (పర్వములు) వలె నొకదానిపై నొకటిగా సమర్పఁబడి నడుమ ఛిద్రములుగల గుండ్రని యెముకల పేర్పుకలది కనుక వేణుదండ మనియు దాని వ్యవహారనామము.) దేహమును ధరించుచున్నది. అది బలమైన యెముకలతో నిర్మింపఁబడినది. దాని నడుమనే బ్రహ్మనాడి యున్నది. కఠవల్లీ శ్రుతియందు హృదయశబ్ద ముండుటచేత నీ నాడి సుషుమ్న కాదనియు, అదియే పతంజలి దర్శనమునందుఁ 'గూర్మనాడి' యని చెప్పఁబడినదనియుఁ గొదంఱి సమన్వయము. దానియందు ధ్యాన ముంచినచో మన స్థ్సిరతమాత్రము కలుగును. కాని సుషుమ్నయందు ధ్యానము నిల్పఁబడి ప్రాణ ముచ్చరించుటచే సమాధ్యవస్థ కలుగును, ఏలన, యోగీశ్వరుల యనుభవము నంతియే. శ్రుతులును దానిని సుషుమ్న యనియే తెలియఁ జెప్పినవి. తంత్రశాస్త్రములందును బురాణము లందును సుషుమ్నా వర్ణన మెంతో కానవచ్చును.

తక్కిన నాడులు సంజ్ఞానాత్మకములు, క్రియాత్మకములుగా నుండుటచే రెండు విధములు వానిచేతనే యనఁగా వాని దారినే ప్రాణశక్తి ప్రవహించును. ఈ సుషుమ్న ప్రాణమయము. అన్నమయకోశము లోపలఁ బ్రాణమయ కోశ మున్నది. అది సూక్ష్మశక్తిమయము. ఈ శక్తి స్థూల శరీరమందలి పార్థివ తంతుజాలము దారిని వ్యాపించుచున్నను. ఆ తంతుజాలము - అనఁగా నాడీసమూహము ప్రాణమయ కోశము కాదు.

మనోమయ విజ్ఞానమయ కోశములు

హృదయమందే మనస్సుయొక్క స్థానము.

'మనోమయోయం పురుషో

భాసత్యస్మిన్నంతర్‌ హృదయే'

--బృహ - శ్రుతి.

మనోమయుఁడైన పురుషుఁడు హృదంతరమందు భాసించును. ఆ మనస్సు ప్రాణము ననుసరించుచుండును. అదియుఁ బ్రాణశక్తి యాధారముగానే నడుచుచున్నది. మనోగతియుఁ బ్రాణము వెంట నంటియే యుండును. ఇటులు చెప్పఁబడినది.

'ఇంద్రియాణాం హిచరతాం యస్మనోను విధీయతే |

తదస్య హరతి ప్రజ్ఞాం వాయు ర్నావ మివాంభసి|'

--గీత.

'చలించుచున్న యింద్రియముల వంటి పోవుచున్న మనుష్య మనస్సు - వాని బుద్ధిని నీటఁ బోవుచున్న నావను వాయువువలె నెట్టుకొని పోవును. ఇంద్రియములు ప్రాణశక్తి చేయు స్థూలకార్యములే. దీనినే 'మనోమయకోశ' మందురు. యోగ శాస్త్రమందు - 'సంకల్పాత్మకం మనః' -- అనుటచే మనస్సుయొక్క గతి సంకల్పమయమైనపుడు 'మనోమయకోశ' మనఁబడును. చిత్తవృత్తులను 'మనోమయకోశ తరంగము' లని తెలియవలెను.

ఈ మనోమయకోశము విజ్ఞానమయ కోశముతోఁ గూర్మనాడి ననుసరించి (దారిని) చేరియున్నది.

మూర్ధమందు (మస్తిష్క మందు) విజ్ఞానమయకోశము గలదు. చేతన, సంవిత్తు, బుద్ధి, అహంకృతి - యనునవి విజ్ఞాన మయకోశ ధర్మములు. ఇవి యన్నియుఁ జైతన్యముయొక్క వివిధావస్థలే. విజ్ఞానమయకోశము మూఁడు స్తరములు (అనఁగా మెట్లవంటి మూఁడవస్థలు.) కలది.

1. సంస్కారాశయము. 2. స్మృతి. 3. శుద్ధసంవిత్తు. ఇందు మొదటిది; మనుష్యుండు పూర్వజన్మమందుఁ జేసిన మంచిసెడ్డలైన కర్మముల సంస్కారములు (వాసనలు). ఈ కోశమందే సంచితములై యుండును. కనుకనే దీనికి సంస్కారాశయము, కారణ శరీర మని పేళ్ళు. ఈ సంస్కారములు మఱలఁ దలపునకు వచ్చుటయే 'స్మృతి'. అప్పుడు వాని సంబంధమైన తెలివి కలుగును. ఇది రెండవ స్తరము. మూఁడవ దైన ('శుద్ధ సంవిత్తునందు' నిరుపాధిక జ్ఞాన ముదయించును. అది శుద్ధసత్త్వగుణ ప్రాధాన్యముచే ఁ కలుగును. అపుడింద్రియ జ్ఞానము, వృత్తిజ్ఞానము మఱి యుండదు. ఇది మూఁడవస్తరము.

శక్తి త్రయ వర్ణణము.

శక్తి - ఇచ్ఛాత్మిక, జ్ఞానాత్మిక, క్రియాత్మిక - యని మూఁడు విధములు. (ఇచ్ఛాశక్తి - జ్ఞానశక్తి - క్రియాశక్తి స్వరూపిణీ - సహస్రనామ స్మృతి) అనఁగా నీ మూఁడు విధములుగా వ్యక్తమగును. ఇచ్ఛాశక్తి 'మనోవిజ్ఞానసమయముల వలన' ననఁగా వాని నాశ్రయించి పనిచేయు చుండును. జ్ఞానేంద్రియములదారిని బనిసేయునది 'సంజ్ఞానాత్మకశక్తి, శబ్ద స్పర్శ రూప రస గంధము లనెడి విషయములను గ్రహించు నింద్రియములు జ్ఞానేంద్రియములు. వీనియందుఁ బనిసేయు శక్తినే 'జ్ఞానశక్తి యందురు.

వాక్పాదపాణి పాయూవస్థములు - అనఁగా 'పలుకుట, నడచుట, పట్టుకొనుట, మలవిసర్జనముచేయుట, మైథున యోగ్య స్త్రీ పురుషాంగ కార్యములు' - జరుపునవి కర్మేంద్రియ ములు. వీనియందుఁ బనిచేయు శక్తిని 'క్రియాశక్తి' యందురు.

పైని జెప్పిన మనోబుద్ధీంద్రియాదు లన్నియు బండి యండ తూమునందు రేకు లమర్పఁబడి యున్నటులే చైతన్యము నాశ్రయించియే యున్నవి.

ప్రాణాదిశక్తి పంచక వర్ణనము.

ప్రాణము 'ప్రాణపాన వ్యానోదాన సమానము' లని యైదు విధములుగా నున్నది. ఈ యైదును నొక్క శక్తి యొక్క యవాంతర భేదములే. అయినను నైదు విధములైన వేర్వేఱు కార్యములు చేయుట కానవచ్చును. వీని కార్యములు బ్రహ్మాండ పిండాండముల నంతటను జరుగుచున్నవి. కనుకనే యుపనిషత్తులయందు దీని వర్ణనము ఆధిభౌతిక - ఆధ్యాత్మిక దృష్టికోణములచేఁ జేయఁబడి యున్నది.

'ఆదిత్యో హ వై ప్రాణః'

---ప్రశ్నోపనిషత్‌.

నిజముగా బ్రహ్మాండమందు నాదిత్యుఁడే ప్రాణము, అతఁడొక్కఁడే యయిదు రూపములను ధరించి సమస్తమును భరించుచున్నాఁడు.

'తాన్‌ పరిష్ఠః ప్రాణ ఉవాచ మామోహ

మాపద్యథా హమేవైతద్‌ పంచథాత్మానం

ప్రవిభ##జ్యైతద్బాణ మవష్టభ్య విధారయామీతి.'

--- ప్రశ్నోపనిషత్‌.

''ఆకాశాది పంచ తత్త్వములు, పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు ఉభయాత్మక మనస్సు'' - అనువానికన్న సర్వశ్రేష్టమైన ప్రాణము - 'మీరు మోహ పడవలదు; నేనే పిండాండ బ్రహ్మాండములను ధరించు చున్నాను; నేనే నన్నైదురూపములుగా విభజించుకొని యీ శరీరమున కాశ్రయము నిచ్చి యాధిభౌతిక జగత్తును ధరించుచున్నాను.''

'ఏషోగ్ని స్తపత్యేష సూర్య ఏష పర్జన్యోమఘవా

నేష వాయుః ఏష పృథివీ రయి ర్దేవ స్సదసచ్ఛా మృతం చ యత్‌.'

- ప్రశ్నోపనిషత్‌.

ఈ ప్రాణమే యఖండ చైతన్యరూప వస్తువే యగ్ని రూపముతోఁ దపించుచున్నది. ఇదియే సూర్యుండు. ఇదియే యింద్రుండై వర్షించును. ఇదియే వాయువు; ఇదియే భూమి. ఇదియే సర్వభోగ్య పదార్థముల రూపముతో నున్నది. సదసద్రూపముల నున్నదంతయు నిదియే; అమృతస్వరూపమున నున్నది యిదే.

'ఆదిత్యో హ వై బాహ్యః ప్రాణ ఉదయత్యేష హ్యేనం చాక్షుషం ప్రాణ మనుగృహ్ణానః పృథివ్యాం యా దేవతా సైషా పురుషస్యాపాన మవష్టభ్యాన్తరా యదాకాశః స సమానో వాయు ర్వ్యానః.'

-- ప్రశ్నోపనిషత్‌.

ఆదిత్యుఁడే, సూర్యరూపి పరమాత్మయే బాహ్య ప్రాణము, పృథివీ దేవతా రూపశక్తి (ధరణి) పురుషుని యపానమునకు నాశ్రయ మిచ్చి లోపల నంతట వ్యాపించును. అట్లే యాకాశ##మే సమానశక్తి. వాయువు వ్యాసము. తేజస్సు ఉదానమ. ఐదు ఆధ్యాత్మిక రూపములు నొక్క ప్రాణశక్తి భేదములే యని 'ప్రశ్నోపనిషత్తు - 34' నందుఁ జెప్పఁబడినది.

'ఏష ప్రాణ ఇతరాన్ప్రాణా& పృథక్‌ పృథగేన సంనిధత్తే.'

ఆదిత్యుఁ డనెడి సర్వశ్రేష్ఠప్రాణమే తక్కిన ప్రాణాదులైన యైదిఁటికి నాశ్రయమిచ్చి ధరించుచున్నది. ఈ చెప్పఁబడిన ప్రాణపంచక శక్తులవల్లనే 'ప్రాణమయకోశము' సిద్ధమగుచున్నది. అనఁగా నా యైదింటి సమూహమే ప్రాణమయ కోశము.

ఇది పది విధములు గలదని కొందఱి మతము. నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయము ననునవి చేర్పఁగాఁ బ్రాణము దశవిధ మైనదని వా రందురు.

'నాగ' మనునది తుమ్ము. ఎక్కిళ్ళు, త్రేఁపులు - అను వానికిఁ గారణము. 'కూర్మము' ఱప్పపాటు, ఱప్పవిప్పు మున్నగు వానికిఁ గారణము. 'కృకరము' ఆకలి దప్పులకుఁ గారణము. 'దేవదత్తము' నిద్రకుఁ గారణము. 'ధనంజయము' శరీరము మరణించిన పైనిసైత మాకారము చెడకుండునట్లు చేయునది. ఇవి యన్నియుఁ బ్రాణమయకోశము లోనివే' చక్షు శ్శ్రోత్ర ముఖ నాసికములయందుఁ బ్రాణము ప్రతిష్ఠిత మైనది.

ఆపనయనము చేయునది యపానము, గుదోపస్థముల నాశ్రయించి యుండి మల - మూత్ర - రజః - శుక్ర - గర్భములను వాని వాని వేగ కాలములయందు వెడలించునది యని భావము. ప్రాణాపాన వ్యానోదానసమాన శబ్దములు 'ప్ర - అప - వి - ఉత్‌ - సం' అనువానికి 'అన' ధాతువు చేరుటచే నిష్పన్నమైనవి. 'అన' ధాతువునకు జీవన ధారణము చేయుట యని యర్థము. ('అన - ప్రాణనే.') కనుక నీ పంచప్రాణముల కార్యము జీవన ధారణమే ఇందేదే నొకదాని కార్యము వికృతి నొందినపుడు క్రమముగా నది మృత్యువునకే హేతు వగును.

సమానమనునది శరీరమధ్యమును ననఁగా నాభి నాశ్రయించి యుండి యున్న రసమును శరీరమునందంతటను వ్యాపింపఁ జేయునది. కనుకనే సమానవాయు వని పేరు. ప్రశ్నోప నిషత్తునందు శరీరము నడుమ నాభి నాశ్రయించి యుండు ననియు, నది యన్నరసమును శరీరమునం దంతట వ్యాపింపం జేయు వనియు, నది 'సప్తార్చి - ఏడు జ్వాలలు గల' దనియు జ్ఞానేంద్రియము లైదును, మనోబుద్ధులును గలిసి యేడు జ్వాలలనియు వర్ణింపఁ బడియున్నది.

వ్యానశక్తి విశేషించి సర్వ శరీరమందును వ్యాపించి 'అననము' (పోషణము) చేయుచుండును.

ఈ పంచశక్తుల కార్యములనుగూర్చి బ్రశ్నోపనిషత్తు నందుఁ జెప్పఁబడినదానితో నాయు ర్వేదమందు రవ్వంత భిన్నముగాఁ గానఁబడినను విశేష భేదము లేదు. కనుక దాని వివరణము చేయఁబడలేదు. ప్రశ్నోపనిషత్తునందు శాఖా ప్రతిశాఖా లుగా శరీరమందంతట వ్యాపించి డెబ్బదిరెండు వేల నాడులందు సంచరించుచుఁ బోషించునది కనుక నిది వ్యాన మని యున్నది. అయుర్వేదమందు నీ వ్యాసము సర్వశరీరమున వ్యాపించుచుఁ బ్రాణాపానాదులైన తక్కు శక్తుల కార్యము వెల్తిపడినపుడు వానికి సహాయము చేయునది యని యున్నది. మీఁదికిఁ గొని పోవునది గనుక దానికి నుదాన మని పేరు రేతస్సును బతనము గాకుండ మీఁదికిఁ గొనిపోవును. ఉదానశక్తి బలము చేతనే యోగాభ్యాసపరులు తమ వీర్యమును రక్షించుకొని బ్రహ్మచర్యమును బాలించుకొందురు. అటులు చేయువారినే యూర్ధ్వ రేతస్కు లందురు. వారు సుషుమ్న యందుఁ బ్రాణ శక్తిని నిలిపి సమాధ్యవస్థ ననుభవింతురు. (నా 'సోహం సమాధి' యను గ్రంథమునను. 'సాధనసామగ్రి' తొలిమూట యందును సమాధిని గూర్చిన వ్యాసము చూడఁదగును.) సాధారణ మానవుల యీ యుదాన శక్తియే మరణవేళ వారి ప్రాణములను బుణ్యాపుణ్య లోకములకుఁ గొనిపోవును. పుణ్యాతి రేకముచే దేవలోకము, పాపాతిరేకముచేఁ దిర్యగాది నీచలోకములును, వాని సమత్వముచేఁ మర్త్యలోకమును లభించును. శ్రీమచ్ఛంకరులును 'ఏకానాడ్యా' అనుదానికి సుషుమ్న చేత ననఁగా 'సుషుమ్న దారిని' అని వ్రాసిరి.

ఆనంద వికాస లక్షణము.

'అసంగోహ్యయ మాత్మానందమయః' - అసంగుఁడైన యాత్మ యానందమయుఁడు. అయినను నాత్మవలన నుట్టు నానంద మొక కోశముగా నెన్నఁబడెను. అది తమోగుణముచే నావరింపఁబడినది.

బ్రహ్మసూత్రములందు శ్రీ వ్యాసులు ఆనందమయ మను చోట 'మయట్‌' ప్రత్యయము ప్రాచుర్యార్థమందుం బ్రయుక్త మైనదే కాని, వికారార్థమందఁ గాదనిరి దీనికి వ్యతిరేకముగ నన్నమయ - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయముల యందు 'మయట్‌ ' ప్రత్యయము వికారార్థమందుఁ జేయఁబడినది. అపుడన్న మయాదులవలె నానంద మొక కోశము కావలయును. అటులుకాదు. ఈ ప్రతిపక్షి మాటకు నా సందేహమునకు సిద్ధాంతపక్షమం దిట్ల సమాధాన మిచ్చు చున్నారు. ఇటులు కాదు. ఇచట 'మయట్‌' ప్రత్యయ ప్రయోగము ప్రాచుర్యార్థమందే చేయఁబడినదని కోశ విరణము చేయునప్పుడే ఋజువు చేయఁబడినది.

ఆనందవికాసము సాధకునందుఁ గంపన - నిద్రా - మూర్ఛా - హాసాది రూపముల నగును.

శక్తి పాతము కాఁగా నే శిష్యుని స్థూల సూక్ష్మ శరీరముల యందు శక్తి వ్యాపించును గాని పూర్ణ వికాసము కలుగనంతవఱకు గురువు దగ్గఱ నుండవలయును. కనుకనే మూఁడు రాత్రులు గురు సన్నిధి నుండుట తప్పదని నియమించిరి. సాధారణముగాఁ బలువురకు మూఁడు దినములలో వికాసము కలుగును. ఉత్తమాధికారులకు నా క్షణమందే పూర్ణవికాసము కలుగును. కాని, వారు సైతము మూఁడు రాత్రుల నియమము పాలింపవలయును పైని జెప్పినట్లుగా వికాసము ప్రాణశక్తి యొక్క యుత్థానమువలనఁ గలుగును. దానివలన మొదటఁ బ్రాణమయకోశమందు శక్తి ప్రభావము వెలయును. దాని వలన శిరస్సు, శరీరము బరువెక్కుట మున్నగు లక్షణములు తోచును. స్థూల శరీరమనఁగా నన్నమయ కోశమందు దాని ప్రభావముచే వడఁకుట, ఒడలు తిరుగుట మొదలగు చిహ్నములతో శక్తి క్రియావతి యగును. తోడనే యానందముబుక నారంభించును. అప్పుడప్పుడు నిద్రయు వచ్చును. ఒక్కొక్కనికి నానంద ముబుకునంతనే తెలివి తప్పును. కాని సాధారణముగా యథార్థ మూర్ఛరాదు. కాని శిష్యునకు మాత్ర మప్పటి సర్వానుభవముల తెలివి యుండును. చిత్త నిరోధ మగుటయే మనోమయ వికాసముగా నెఱుంగవలెను. దివ్యశ్రవణము, దివ్యదృష్టి, దివ్యస్పర్శము, దివ్యరసము, దివ్య గంధముల యనుభవము విజ్ఞానమయకోశ వికాసలక్షణములు. ఆనంద ప్రాదుర్భావమునే యానంద స్వరూపాత్మానుభవముగా నెఱుంగవలయును.

కోశవికాసము ప్రణశక్తి మేల్కొని లేచుటవల్లనే యగును. ఉపనిషత్తులయందుఁ బ్రాణోపాసన వర్ణనము కనుచున్నాము. ప్రాణమే బ్రహ్మముగాఁ జెప్పఁబడినది. సాధారణ సంభాషణమునందును బ్రాణమనుమాట చేతనాశక్తి యను నర్థమందే వ్యవహవింపఁ బడుచున్నది. తఱచుగాఁ 'బ్రాణాంతము' అనుమాట 'మరణ' మను నర్థమందే చెల్లిపోవుచున్నది. ఇంక 'ప్రాణి' యనఁగా జీవుఁడను నభిప్రాయమందే చెల్లుచున్నది. కాని 'శ్వాసగతిని' సైతము ప్రాణ మందురు. ఏలన శ్వాస ప్రశ్వాసములపైనే జీవన మాధారపడి యున్నది. మఱియు దానివల్ల నే సమస్తమైన జీవనకళలు పనిచేయుచున్నవి. నిజముగా నా శక్తి ప్రాణమే దానివల్లనే సర్వాంగ ప్రత్యంగములు, చిన్ననాడుల పర్యంతము తమతమ పనులు చేయు చున్నవి.

అంతే కాదు ; మనోబుద్ధీంద్రియములును ప్రాణము పైనే యాధారపడి యున్నవి. జాగ్రత్‌ - స్వప్న - సుషుప్త్యవస్థలు సైతము ప్రాణము నాశ్రయించియే యున్నవి. సుషుప్తియందు మనోబుద్ధీంద్రియములు నిష్క్రియము లగు చున్నవి. కాని, యెప్పుడును బ్రాణాపానాదు లన్నియు వాని వాని పనులు చేయుచునే యుండును. శ్వాస ప్రశ్వాసములను బ్రాణమని వ్యవహరించు నభిప్రాయ మేమనఁగా హృదయ పిండము, పుప్ఫుసములు (ఊపిరితిత్తులు) అను వానిచేత సంతతము - అనంగా నన్ని యవస్థలయందును బనిచేయించు శక్తి ముఖ్య ప్రాణము. మూఁడవస్థల యందును బ్రాణశక్తి ప్రవాహము సర్వశరీరమందలి నాడులదారిని జరుగుచునే యుండును. మఱియు నాయా నాడులకు నా యా పనులు నియుక్తములై యుండును, అయినను బ్రాణప్రవాహ మెల్లప్పుడును బహిర్ముఖ మయియే యుండును. కాని యది యెప్పుడంతర్ముఖము కాఁజొచ్చునో యప్పుడు దాని ప్రవాహము సుషుమ్నానాడి దారిని బ్రహ్మరంధ్రమున కెగఁబ్రాకు నని యెఱుంగవలెను. మఱియు, దానికంటె దిగువ నగు నవస్థల యందుఁ జిత్తమునకు నేకాగ్రత వచ్చును, సమష్టిప్రాణము సుషుమ్నయందు మీఁదికి లేచిపోవునపుడు బాహ్య క్రియలు కట్టబడిపోయి, హృదయపిండ శ్వాసక్రియలు సైతము నిలుచునంతగా నగును. యోగాభ్యాసమువలన శక్తి జాగరితకాఁగా నాడీ మలశుద్ధియుఁ గాఁజొచ్చును. అప్పుడవి (నాడులు) శుద్ధములై సరళముగా నగుటచే వానియందు శక్తి ప్రవాహ మే విధముగాను నడ్డగింపఁబడదు. కోరినంత మాత్రమునఁ బ్రాణశక్తి మెఱుపుతీవవలె సంచరింపఁ జొచ్చును. అపుడది శరీరమందలి సర్వనాడులవలన నీడ్వఁబడి (సాగింపఁబడి) సరళముగా సుషుమ్నయందు నెగఁబ్రాకి పోవును.

పైని జెప్పఁబడిన ప్రాణాపానాది శక్తిపంచక మీ ముఖ్య ప్రాణముయొక్క యవాంతరభేదమే. ఆ ప్రాణాదుల భిన్న భిన్న కార్యక్రమమువలన భిన్న భిన్న నామములతో వ్యవహరింపబడు ననుట మును జెప్పియున్నాము.

Shaktipatamu    Chapters    Last Page